Japan Earthquake: జపాన్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 92 మరణించారు. మరో 242 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు అక్కడి రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. అయితే సహాయక చర్యలకు సమయం మించిపోతుండటంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Isro Chief Somanath: నేడు జేఎన్టీయూ స్నాతకోత్సవం.. ఇస్రో చీఫ్ కు డాక్టరేట్ ప్రదానం
ఈ భారీ భూకంపం సునామీని ప్రేరిపించింది. తీరంలో ఒక మీటర్ ఎత్తుతో అలలు ఎగిసిపడ్డాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భూకంపం 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీని గుర్తుకు తెచ్చింది. తాజాగా సంభవించిన విపత్తులో కేవలం రోజు వ్యవధిలోనే 150కి పైగా భూకంపాలు సంభవించాయి.