NTV Telugu Site icon

Y. V. S. Chowdary : హీరోగా ఎన్టీఆర్ ముని మనవడు..వైవిఎస్ చౌదరి బిగ్ అనౌన్స్మెంట్..

Yvs Chowdary

Yvs Chowdary

Y. V. S. Chowdary : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినా వైవిఎస్ చౌదరి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో ఈ దర్శకుడు సీతయ్య ,సీతారామరాజు ,లాహిరి లాహిరి లాహిరిలో,దేవదాసు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఎంతగానో అలరించిన ఈ దర్శకుడు..ఆ తరువాత వరుస ఫ్లోప్స్ రావడం అలాగే నిర్మాతగా కూడా ఎంతో నష్టపోవడంతో సినిమాలకు దూరమయ్యారు.అయితే ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని.ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకోని చేస్తుంటారు.2015 లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ను “రేయ్” సినిమాతో పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి ఆ సినిమా ప్లాప్ కావడంతో సినిమాలకు దూరం అయ్యారు.

Read Also :Pushpa 2 : రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..?

ఇదిలా ఉంటే దాదాపు 9 ఏళ్ళ తరువాత వైవిఎస్ చౌదరి మెగా ఫోన్ పట్టనున్నారు.దివంగత నందమూరి జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ పై యలమంచలి గీత గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు రమేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు.నేడు పూజా కార్యక్రమం నిర్వహించి సినిమా గురించి బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాతో ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి హీరో ,హీరోయిన్స్ పాత్రల గురించి అలాగే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.

Show comments