యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు..
అందుకు తగ్గట్లుగానే ఫ్యాన్స్ కు మరింత ఊపు వచ్చేలా పోస్టర్స్ ను అలాగే, గ్లింప్స్ వదిలారు.. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గూస్ బంప్స్ తెప్పించే డైలాగులతో కొరటాల ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్ గా మారుస్తున్నారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. త్వరలో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు వెకేషన్ బయలుదేరారు.. ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తన భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెకేషన్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సినిమాల విషయానికొస్తే.. దేవర తర్వాత హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 మల్టీస్టారర్ మూవీలో తారక్ నటించాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తో చిత్రం కూడా ప్రారంభం అవుతుందట. మొత్తంగా ఎలా చూసుకున్నా వచ్చే ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే..
