Site icon NTV Telugu

War 2 : హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్.. అదిరిపోనున్న ఆ సాంగ్..?

Whatsapp Image 2024 05 07 At 8.06.42 Am

Whatsapp Image 2024 05 07 At 8.06.42 Am

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు కొరటాల ప్రస్తుతం దేవరలో ఎన్టీఆర్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో ‘వార్‌ 2’ షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ ఓ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు.ఈ సాంగ్ లో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కూడా భాగం కానుంది.అయితే ఇదొక పబ్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. బ్యాగ్రౌండ్‌లో కొన్ని సీన్స్‌ జరుగుతూ ఉండగా ఈ పాట నడుస్తూ ఉంటుందని సమాచారం.కథలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ పాటలో ఎన్టీఆర్ , హృతిక్‌ రోషన్ పోటీపడి మరీ స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్‌ ఆవుతుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌గా తెరక్కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .

Exit mobile version