NTV Telugu Site icon

Ntr : చిరంజీవి నటించిన సినిమాలలో ఎన్టీఆర్ కు నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

Jr Ntr And Chiranjeevi

Jr Ntr And Chiranjeevi

ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి సినిమా తో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఇందు లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్త ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో లో ఎన్టీఆర్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో రుద్రవీణ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ సినిమా 1988లో విడుదల అయింది. తల్లి పేరు పై నాగబాబు నిర్మాతగా చిరు సొంత బ్యానర్ మొదలుపెట్టిన సందర్బంగా ఆ బ్యానర్ లో డెబ్యూ రుద్రవీణ.కులాల అంతరాల గురించి సంగీతానికి ముడి పెడుతూ దర్శకుడు బాలచందర్ రుద్రవీణ సినిమాని ఆవిష్కరించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది. యముడి కి మొగుడు లాంటి కమర్షియల్ సినిమాతో మాస్ ని ఊపేస్తున్న ఆ సమయంలోనే చిరంజీవి చేసిన సినిమా కావడం తో రుద్రవీణ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.. కానీ మెగాస్టార్ లోని బెస్ట్ యాక్టర్ ను బయటికి తెచ్చింది ఈ సినిమా. అందుకే ఆ సినిమా అంటే ఇష్టం అని తెలిపారు ఎన్టీఆర్.ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను చిరంజీవి కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే.