Site icon NTV Telugu

NTR-Neel: రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ మాస్ సాంగ్? షూటింగ్ స్పీడ్ పెంచిన ప్రశాంత్ నీల్!

Ntr Prashanth Neel

Ntr Prashanth Neel

NTR-Neel: జూనియర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’(ప్రచారంలో ఉన్న టైటిల్). నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే మామూలు హైప్ లేదు. ఇటీవలే ఈ చిత్ర బృందం జోర్డాన్‌లో షూటింగ్ ముగించుకొని హైదాబారాబాద్ చేరుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. మార్చి ఎండింగ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ షూట్ చేయనున్నట్లు జోరుగా టాక్ నడుస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైలెట్ మూవీగా నిలపడానికి ప్రశాంత్ నీల్ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్‌కే ఎక్కువ టైం కేటాయించినట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడని చర్చించుకుంటున్నారు.

READ ALSO: షేర్ ఆగయ.. 144Hz OLED డిస్‌ప్లే, 6500mm IceCore VC కూలింగ్ సిస్టమ్,100W ఫ్లాష్ ఛార్జ్ తో iQOO 15R లాంచ్..!

ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా.. ఈసినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ రోల్‌లో క‌నిపించే ఛాన్స్‌ ఉందంట. ఆ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో అఖిల్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని ఇన్ సైడ్ టాక్. ఎన్టీఆర్ మాస్ పవర్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్‌ ఇప్పుడు అఖిల్ కూడా అదనపు ఆకర్షణ కావడంతోజ్ ఈ సినిమాపై క్రేజ్ రెట్టింపు అయ్యింది. అయితే అఖిల్ రోల్ కు సంబంధించి అధికారకంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

READ ALSO: ViRash Wedding: ఉదయపూర్‌లో విరోష్ పెళ్లి సందడి.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన తరుణ్ భాస్కర్, ఈశా రెబ్బా!

Exit mobile version