గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు..
ఈ సినిమా మొదటి పార్ట్ ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఎన్టీఆర్ తొలిసారి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు అంగీకరించాడు. అదే వార్ 2. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మార్చి లేదా ఏప్రిల్ లో వార్ 2 షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు.. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు..
ఇదిలా ఉండగా తాజాగా ఈ హీరో గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఎన్టీఆర్ కు ఒక డ్రీమ్ రోల్ ఉందట. అదేంటో మీరు అస్సలు గెస్ చేయలేరు. నిజానికి ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి పాత్రలోనైన ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషల్.. అయితే ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో శ్రీ కృష్ణుడి పాత్రను పోషించాలని అనుకుంటున్నారట. టాలీవుడ్ లో రాముడైనా.. కృష్ణుడైనా, కర్ణుడైనా..దుర్యోధనుడు తెలుగు ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గారి రూపమే మొదట గుర్తుకు వస్తుంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ల తాత మాదిరిగా కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించాలని అనుకుంటున్నారట.. ఆ డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఉందని చెబుతున్నారు.. ఆ అవకాశం వెయిట్ చేస్తున్నట్లు కూడా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు..
