NTV Telugu Site icon

Ntr : కంగ్రాట్స్ బావ.. పార్టీ లేదా మరి..

Whatsapp Image 2023 08 24 At 7.59.42 Pm

Whatsapp Image 2023 08 24 At 7.59.42 Pm

నేడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకు గానూ ప్రకటించడం జరిగింది.. ఉత్తమ చిత్రంగా ఉప్పెన మరియు బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ప్రొవైడింగ్‌ వోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డులను గెలుచుకున్నాయి.ఇదిలా ఉంటే ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు వరించింది. ఒక తెలుగు హీరో కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు.ఒక తెలుగు సినిమా హీరో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం అంటే అంతకుమించిన గొప్ప విషయం ఏమి లేదు.. ఇన్నాళ్లు కేవలం హిందీ సినిమాలకు అలాగే హిందీ హీరోలకు మాత్రమే ఇలాంటి ఘనత దక్కుతూ వస్తుంది.కానీ ఈ సారి మన తెలుగు సినిమా సత్తా చాటింది. పుష్ప చిత్రంలో తన అద్భుత నటనకు గానూ ఆయనకు ఉత్తమ నటుడుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇలా నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తంగా 11 నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమాకు దక్కడం విశేషం.. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో తెలుగు సినిమా అవార్డులు సొంతం చేసుకోలేదు. నేడు తెలుగు సినిమాకు ప్రౌడ్ మూమెంట్ గా చెప్పుకోవచ్చు.

2021 డిసెంబర్ లో పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. పుష్పరాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. పుష్ప సినిమా ఇండియా వైడ్ గా మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీలో అద్భుత విజయం సాధించింది. హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అద్భుతమైన మేనరిజమ్స్ తో బాగా పాప్యులర్ అయ్యాయి. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ కు ప్రకటించగానే ఆ సంతోషాన్ని పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ చాలా సేపు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ఎంతో ఏమోషనల్ అయ్యారు. చిత్రం యూనిట్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు.తాజాగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అల్లు అర్జున్ ని అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. కంగ్రాట్స్ బావ.. పుష్ప సినిమాకు గాను ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని ట్వీట్ చేసాడు.. ఈ ట్వీట్‌ క్షణాల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

https://twitter.com/tarak9999/status/1694695398089343477?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1694695398089343477%7Ctwgr%5Ec3f221db0c5901d4015897887279749d45df6735%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F