NTV Telugu Site icon

NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. జపాన్ లేడీ ఫ్యాన్స్ మాస్ సెలెబ్రేషన్స్..

Ntr

Ntr

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో  గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు.ఎన్టీఆర్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు.దీనితో ఎన్టీఆర్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఒక ట్యాగ్ లైన్ వచ్చింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు వుండే క్రేజ్ వేరు.జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూస్తారు.ఎన్టీఆర్ డాన్స్ ను అక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఇష్ట పడతారు.అంతే కాదు ఎన్టీఆర్ సినిమాలోని మాస్ సాంగ్స్ ను రీ క్రియేట్ చేస్తూ అక్కడి ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు.

ఇదిలా ఉంటే నేడు (మే 20 ) ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ కు సినీ ప్రముఖులు అందరు బర్త్ డే విషెస్ తెలియజేసారు.ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ రోజును పండగలా జరుపుకుంటున్నారు.ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు విభిన్నంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో జపాన్ లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఎన్టీఆర్ కటౌట్ కు పూల మాల వేసి పూలు చల్లుతూ ఎన్టీఆర్ హిట్ చిత్రంలోని సాంగ్ కు మాస్ డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments