Novak Djokovic Eye on Margaret Court Record: రెండో సీడ్, సెర్బియా యోధుడు నోవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో పదోసారి యుఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో జకోవిచ్ 6-3, 6-2, 7-6 (7-4)తో వరుస సెట్లలో బెన్ షెల్టన్ (అమెరికా)పై విజయం సాధించాడు. జకో దూకుడు ముందు షెల్టన్ తొలి రెండు సెట్లలో నిలవలేకపోయాయడు. అయితే సెట్లో మాత్రం కాస్త పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. యుఎస్ ఓపెన్ 2023లో 20 ఏళ్ల షెల్టన్ సంచలన ప్రదర్శనకు జకోవిచ్ తెరదించాడు.
యుఎస్ ఓపెన్ టోర్నీలో నోవాక్ జకోవిచ్‌కు ఇది వందో మ్యాచ్. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన జకోవిచ్.. మరో రికార్డుపై కన్నేశాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ కుర్రాడు డేనియల్ మెద్వెదెవ్‌తో తలపడనున్న జకో గెలిస్తే 24వ టైటిల్ ఖాతాలో చేరుతుంది. దీంతో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన మార్గరెట్ కోర్ట్ (24)ను జకోవిచ్ సమం చేస్తాడు. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ ఫైనల్ చేరిన జకోను మెద్వెదెవ్ నిలువరిస్తాడో లేదో చూడాలి.
Also Read: Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు తెల్లవారుజామున 4 గంటలకు వైద్య పరీక్షలు.. మరికాసేపట్లో.. !
సెమీస్‌లో మెద్వెదెవ్ 6-7 (3-7), 1-6, 6-3, 3-6 తేడాతో టాప్‌సీడ్ కార్లోస్ అల్కరాస్‌పై గెలిచాడు. దాంతో వరుసగా రెండో ఏడాదీ యుఎస్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవాలనే అల్కరాస్ కోరిక నెరవేరలేదు. వింబుల్డన్ గెలిచి జోరు మీదున్న మెద్వెదెవ్.. సెర్బియా యోధుడు జకోవిచ్‌తో తలపడనున్నాడు. రెండో గ్రాండ్‌స్లామ్ విజయం కోసం మెద్వెదెవ్ పట్టుదలతో ఉన్నాడు. 2021 యుఎస్ ఓపెన్‌లో జకోవిచ్‌పైనే గెలిచిన మెద్వెదెవ్.. గ్రాండ్‌స్లామ్ బోణీ కొట్టాడు. దాంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
