Site icon NTV Telugu

Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం

Novak

Novak

Novok Djokovic : సెర్బియన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3, 7-6, 7-6 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. పదిహేనేండ్ల క్రితం తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సమయంలో జొకోవిచ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మెల్‌బోర్న్‌లో తనకు తిరుగులేదని చాటుతూ.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఓపెన్‌ ఎరాలో ఉద్దండపిండాలతో కలిసి ఆడుతూనే 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు.

Read Also: U19 women’s worldcup : అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా

2008లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గాడు జొకోవిచ్‌. ఆ తర్వాత 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లో టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. సెర్బియా నుంచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన నొవాక్‌ జొకోవిచ్‌.. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి నెగ్గుతూ తన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సంఖ్యను 22కు పెంచుకున్నాడు. గతేడాది కరోనా వ్యాక్సిన్‌ వేసుకోలేదన్న కారణంగా జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యాక్సిన్‌ తప్పనిసరి చేయగా.. జొకోవిచ్‌ అందుకు ససేమీరా అన్నాడు. దీంతో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడే చాన్స్‌ కోల్పోయాడు. అయితే ఏమాత్రం వెనకడుగు వేయని జొకో.. ఈసారి బదులు తీర్చుకున్నాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో 10సారి టైటిల్‌ ముద్దాడాడు. 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తన చేతిలో ఓడిన సిట్సిపాస్‌ను మరోసారి చిత్తు చేస్తూ 22వ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు.

Exit mobile version