NTV Telugu Site icon

UPSC: కేంద్ర సాయుధ బలగాల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్‌.. డిగ్రీ ఉంటే చాలు..

Upsc

Upsc

సీఏపీఎఫ్‌ (కేంద్ర సాయుధ బలగాల) లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు తాజాగా యూపీఎస్సి నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 506 పోస్టుల భర్తీకి యూపీఎస్సి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో భాగంగా బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ చొప్పున అసిస్టెంట్ కమాండెంట్ల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వీటి కోసం మే 14 వరకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులను చేసుకోవచ్చు.

Also read: Varalaxmi: లైఫే రిస్క్… ‘శబరి’ సీట్ ఎడ్జ్ సైకలాజికల్ థ్రిల్లర్ – వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ

ఈ నోటిఫికేషన్‌ సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే., ఇందులో మొత్తం ఉద్యోగాలు 506 భర్తీ చేయనుండగా.. బీఎస్‌ఎఫ్‌లో (186), సీఆర్‌పీఎఫ్‌ (120), సీఐఎస్‌ఎఫ్‌ (100), ఐటీబీపీ (58), ఎస్‌ఎస్‌బీ (42) పోస్టులను రిక్రూట్మెంట్ చేయనున్నారు. ఇక ఆపై చేసుకొనే అభ్యర్థులు డిగ్రీ విద్యార్హతలతో పాటు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

Also read: Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” రిలీజ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..

ఇక అభ్యర్థుల వయస్సు విషయానికి వస్తే.. ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా కొన్ని వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఇక వీటికి అర్హత ఉన్నవారు ఏప్రిల్‌ 24 నుంచి మే 14 సాయంత్రం 6 గంటల లోపల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఇందులో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 15 నుంచి 21 వరకు సరిచేసుకొనే అవకాశం ఉంది.

ఇక ఈ ఎంపిక విధానంలో రాత పరీక్ష (పేపర్ -1, పేపర్ -2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా అనేక టెస్ట్ ల ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండగా.. ఒకవేళ తప్పుడు సమాధానం రాస్తే మాత్రం నెగెటివ్‌ మార్కులు ఇందులో ఉంటాయి. ఈ పరీక్షకు దరఖాస్తు ఫీజు రూ.200లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు కలదు. రాత పరీక్ష ఆగస్టు 4న జరగనుంది.