Nothing Phone 2a Price: ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2ఏ అమ్మకాలు.. తొలిరోజు కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone 2a Price and Launch Offers in Flipkart: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన బ్రాండ్ ‘నథింగ్’. ఇప్పటివరకు నథింగ్ నుంచి విడుదలైన ఫోన్స్ రెండే అయినా.. మంచి క్రేజ్ వచ్చింది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2లకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండడంతో చాలామంది కొనటం లేదు. దీంతో మిడ్ రేంజ్లో తాజాగా ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మార్చి 12 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,999గా. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు (మార్చి 12) కొనుగోలు చేసేవారికి రూ.19,999కే నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ లభించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ. 2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 2వేలు చొప్పున తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
Also Read
నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో వస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటు ఇందులో ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌తో వస్తోంది.
నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండగా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. అయితే ఈ ఫోన్ కొనుగోలు సమయంలో ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తారు. అడాప్టర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!