NTV Telugu Site icon

Nothing Phone 2a Price: ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ అమ్మకాలు.. తొలిరోజు కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్!

Nothing Phone 2a Price

Nothing Phone 2a Price

Nothing Phone 2a Price and Launch Offers in Flipkart: వన్‌ప్లస్‌ సహ వ్యవస్థాపకుడు కార్ల్‌ పై స్థాపించిన బ్రాండ్‌ ‘నథింగ్‌’. ఇప్పటివరకు నథింగ్‌ నుంచి విడుదలైన ఫోన్స్ రెండే అయినా.. మంచి క్రేజ్ వచ్చింది. ట్రాన్సపరెంట్‌ లుక్‌లో లాంచ్‌ అయిన నథింగ్‌ ఫోన్‌ 1, నథింగ్‌ ఫోన్‌ 2లకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండడంతో చాలామంది కొనటం లేదు. దీంతో మిడ్‌ రేంజ్‌లో తాజాగా ‘నథింగ్‌ ఫోన్‌ 2ఏ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. మార్చి 12 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.25,999గా. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా ఉంది. లాంచ్‌ ఆఫర్‌ కింద తొలిరోజు (మార్చి 12) కొనుగోలు చేసేవారికి రూ.19,999కే నథింగ్‌ ఫోన్‌ 2ఏ ఫోన్‌ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డు ద్వారా రూ. 2వేలు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ. 2వేలు చొప్పున తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 2.5తో వస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్‌ డిస్‌ప్లే, 30Hz నుంచి 120Hz రిఫ్రెష్‌ రేటు ఇందులో ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌తో వస్తోంది.

Also Read: BYD Seal EV Price: భారత మార్కెట్లోకి బీవైడీ సీల్‌ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 650 కిలోమీటర్ల ప్రయాణం!

నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్మార్ట్‌ఫోన్‌ వెనకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండగా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. అయితే ఈ ఫోన్ కొనుగోలు సమయంలో ఛార్జింగ్ కేబుల్‌ మాత్రమే ఇస్తారు. అడాప్టర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.