Nothing Phone 2 has been launched in India: సూపర్ డిజైన్, మంచి ఫీచర్లతో ‘నథింగ్’ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్ సహా భారత మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 1కి డిమాండ్ పెరగడంతో.. కంపెనీ నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మంగళవారం నథింగ్ ఫోన్ 2ను ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. థింగ్ ఫోన్ 2లో ప్రొగ్రెస్ బార్ ఫీచర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఫీచర్లు, ధరల వివరాలను చూద్దాం.
Nothing Phone 2 Price:
నథింగ్ ఫోన్ 2 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999 కాగా.. 12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ. 49,999. ఇక 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. డార్క్ గ్రే, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 21 నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, రిటైల్ ఔట్‌లెట్‌లలో అమ్మకాలు ప్రారంభకానున్నాయి. ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Nothing Phone 2 Camera:
ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0తో నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీవో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. నథింగ్ ఫోన్ 2 క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలు (వెనుక రెండు, ముందు ఒక కెమెరా) ఉన్నాయి. వెనుక వైపు రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మూడు హై-డెఫినిషన్ మైక్రోఫోన్‌లు, రెండు స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.
Also Read: IND vs WI: జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్ధం కావడం లేదు: హనుమ విహారి
Nothing Phone 2 Battery:
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 4,700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ పీపీఎస్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్డ్ ఛార్జింగ్‌లో 55 నిమిషాల్లో, వైర్‌లెస్ ఛార్జింగ్‌లో 130 నిమిషాల్లో ఈ ఫోన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని నథింగ్ కంపెనీ పేర్కొంది. ఇక ఈ ఫోన్‌కు రెండు వైపులా గొరిల్లా గ్లాస్ ఉండనుంది.
Nothing Phone 2 Features:
నథింగ్ ఫోన్ 2 బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందన తెలుసుకునేందుకు ప్రొగ్రెస్ బార్ ఫీచర్ ఇచ్చారు. ఉబెర్, జొమాటో వంటి థర్డ్ పార్టీ యాప్‌ల పికప్, డెలివరీలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఫోన్‌లో ప్రొగ్రెస్ బార్‌లు ఇస్తున్నారు. ఇక ఈ ఫోన్‌తో పాటు నంథిగ్ ఇయర్ 2 (Nothing Ear 2)లో మరో కొత్త కలర్ వేరియంట్ వచ్చింది. కొత్తగా బ్లాక్ కలర్‌లో ఇయర్ 2 బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 9,999 కాగా.. జులై 21 నుంచి కొనుగోలు చేయొచ్చు.