Site icon NTV Telugu

Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

Nothing Headphone 1

Nothing Headphone 1

Nothing Headphone 1:టెక్ ప్రపంచంలో విభిన్న డిజైన్, ప్రత్యేక UIతో గుర్తింపు తెచ్చుకున్న Nothing సంస్థ, ఇప్పుడు తన మొట్టమొదటి ఓవర్ ఈయర్ హెడ్‌ఫోన్‌ ను భారత్‌ లో లాంచ్ చేసింది. Nothing Headphone (1) పేరుతో వచ్చిన ఈ ప్రీమియం హెడ్‌ఫోన్‌ ను జూలై 15, 2025 నుండి అందుబాటులోకి రానుంది. మరి ఈ విభిన్న నథింగ్ హెడ్‌ఫోన్ (1) పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

సౌండ్ క్వాలిటీ:
Nothing Headphone (1) 40mm డైనమిక్ డ్రైవర్‌తో రూపొందించబడింది. ఇది నికెల్-ప్లేటెడ్ PU డయాఫ్రాగం, హై లీనియరిటీ సస్పెన్షన్‌ తో సౌండ్ క్లారిటీని మెరుగుపరుస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌ ఆడియో రంగంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న KEF సంస్థతో కలిసి అభివృద్ధి చేయబడింది. డ్రైవర్‌లు, చాంబర్లు, సాఫ్ట్‌వేర్‌ అన్నీ KEF ల్యాబ్‌లలో ట్యూనింగ్ చెయ్యబడ్డాయి.

Read Also:Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

క్లీన్ వాయిస్ టెక్నాలజీ:
ఈ కొత్త Headphone (1) లో 42dB హైబ్రిడ్ Active Noise Cancellation (ANC) ఉంది. ఇది ప్రతి 600msకి పరిసర శబ్దాన్ని స్కాన్ చేస్తుంది. అలాగే, వేర్ డిటెక్షన్ సిస్టమ్ ప్రతి 1875msకి ఈయర్‌ కప్‌, కెనాల్ మధ్య లీకేజ్‌ ను ట్రాక్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్, స్పటైల్ ఆడియో, అడాప్టివ్ బాస్ ఎన్హాన్స్మెంట్ , డైనమిక్ హెడ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు వినియోగదారులకు 360° ఆడియో అనుభవాన్ని ఇస్తాయి. అలాగే క్లియర్ వాయిస్ టెక్నాలజీ ద్వారా వాయిస్ కాల్స్ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్ శబ్దాన్ని దూరం చేస్తూ, యూజర్ కు శబ్దాన్ని స్పష్టంగా అందిస్తుంది. ఇది 28 మిలియన్ల రియల్ వరల్డ్ కాల్ డేటాపై ట్రైనింగ్ పొందిన AI మోడల్‌ను ఉపయోగిస్తుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ:
బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. ANCతో 35 గంటల, ANC లేకుండా 80 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో ANC ONతో 2 గంటలకు పైగా వినవచ్చు. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఇందులో బ్లూటూత్ 5.3, LDAC, SBC, AAC కోడెక్స్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్, 3.5mm ఆడియో జాక్, USB-C ఆడియో సపోర్ట్ కలిగి ఉన్నాయి.

Read Also:MLC Kavitha: గోదావరి నీళ్లను ఆంధ్రా వాళ్లు ఎత్తుకుని పోతున్నారు.. కవిత హాట్ కామెంట్స్..!

డిజైన్:
నథింగ్ ప్రత్యేకతైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కొనసాగిస్తూ ఉండగా.. ఈ హెడ్‌ఫోన్‌ కూడా క్లియర్ వ్యూ లుక్‌ తో వచ్చింది. ఈ హెడ్ ఫోన్స్ IP52 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంది. ఈ హెడ్ ఫోన్స్ 329 గ్రాముల బరువు ఉంది. రోలర్, పాడల్, బటన్ కంట్రోల్స్ ద్వారా వాల్యూమ్, ప్లేబ్యాక్, ANC/Transparency మార్పులు, అసిస్టెంట్ యాక్సెస్ వంటి వాటిని నియంత్రించవచ్చు.

ధర:
Nothing Headphone (1) భారత మార్కెట్లో అధికారిక ధర రూ.21,999గా నిర్ణయించబడింది. అయితే, ప్రత్యేక ప్రారంభ ఆఫర్‌ కింద ఇది రూ.19,999కి లభిస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌ విక్రయాలు జూలై 15, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు దీన్ని ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ఆన్‌ లైన్, ఆఫ్‌ లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ప్రముఖ బ్యాంకుల ద్వారా 12 నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version