Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా గతంలో కరోనా వైరస్ సృష్టించిన భీభత్సం ఎవరూ మర్చిపోలేరు. ఆ పరిస్థితుల నుంచి భయటపడే లోపే ఇటీవల హంటా వైరస్ కలకలం రేపింది. ప్రస్తుతం మరో వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా క్రూయిజ్ షిప్‌ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇలాంటి వైరస్లు వేగంగా విస్తరిస్తాయి. ఇటీవలే అమెరికాలో ‘కారిబ్బన్ ప్రిన్సెస్’ షిప్లో వందలాది మంది అస్వస్థతకు గురవ్వగా, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఏకంగా ఒకరు మరణించడం ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఆహారం, నీరు, కలుషిత ఆహారాలు తినడం ద్వారా అతివేగంగా వ్యాపించే ఈ వైరస్, పర్యాటక రంగంపై మళ్ళీ నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.
అంబాసిడర్ క్రూయిజ్ లైన్‌కు చెందిన ‘అంబిషన్’ నౌక మే 6న షెట్లాండ్ దీవుల నుంచి బయలుదేరింది. బెల్ఫాస్ట్, లివర్‌పూల్ మరియు బ్రెస్ట్‌లలో ఆగి, మంగళవారం ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ ఓడరేవుకు చేరుకుంది. నౌకలో ఉన్న 90 ఏళ్ల వృద్ధుడైన ఒక ప్రయాణికుడు అనుమానాస్పద నోరోవైరస్ ఇన్ఫెక్షన్తో మరణించారు. వీరితో పాటు సుమారు 50 మంది ప్రయాణికులలో వాంతులు, విరేచనాలు వంటి నోరోవైరస్ లక్షణాలు కనిపించాయి.
Also Read
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
- WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
మరణం సంభవించడంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ అధికారులు, బుధవారం నాడు నౌకలోని 1,233 మంది ప్రయాణికులు (ఎక్కువగా బ్రిటన్, ఐర్లాండ్ వాసులు) మరియు సుమారు 500 మంది సిబ్బందిని కలిపి మొత్తం 1,700 మందిని నౌకలోనే నిర్బంధించారు. నోరోవైరస్ అత్యంత వేగంగా వ్యాపించే కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్. ఇది సోకిన 12 నుంచి 48 గంటల్లో కడుపు నొప్పి, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ మరింత విస్తరించకుండా ఉండటానికి అధికారులు పారిశుధ్య చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. షిప్ షెడ్యూల్ ప్రకారం స్పెయిన్ వెళ్లాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దాని ప్రయాణాన్ని నిలిపివేశారు. ఈ సంఘటనతో అంతర్జాతీయ ప్రయాణాల్లో పారిశుధ్య ప్రమాణాల ప్రాముఖ్యత మరోసారి చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?