Site icon NTV Telugu

Nominations: నేడే నామినేషన్లకు చివరి రోజు

Nominations

Nominations

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, నేడు నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు ముగిసిపోతుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలు సమర్పిస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా గుర్తిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బీ- ఫాంలు సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తామని చెప్పుకొచ్చింది. ఇక, ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయడంతో పాటు ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. ఇక, 30వ తేదీన పొలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Read Also: Mumbai Road Accident: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి!

నిన్న (గురువారం) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన క్యాండిడేట్స్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక, గజ్వేల్‌, కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సిరిసిల్లో మంత్రి కేటీఆర్‌, సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు, సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, చెన్నూరులో బాల్క సుమన్ సహా.. పలువురు మంత్రులు, పలు పార్టీల నేతలు ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్లకు సమర్పించారు. అయితే, నిన్న (గురువారం) ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1077 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం నామినేషన్ల అన్ని కలుపుకుంటే.. మొత్తం 2 వేల 265 చేరినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వివరించారు.

Exit mobile version