NTV Telugu Site icon

Nokia: మరోసారి కమ్బ్యాక్ ఇస్తున్న నోకియా.. అదే స్టైల్తో..

Nokia Mobies

Nokia Mobies

25 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ నోకియా సబ్-బ్రాండ్‌ గా HMD మార్కెట్‌ లోకి ప్రవేశించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కెన్యాలో కంపెనీ HMD పల్స్ సిరీస్ ఫోన్‌ లను విడుదల చేసింది. అదనంగా., నోకియా 225 కూడా 4Gతో వస్తుంది. నోకియా 3210 త్వరలో లాంచ్ అవుతుందని కూడా ప్రకటించారు. ఈ 2 ఫోన్స్ పల్స్ సరీస్‌ కు సిరీస్ కంటే భిన్నంగా ఉంటాయి. దీని గురించిన సమాచారం Nokiamob వెబ్‌సైట్‌ లో పూర్తిగా చూడవచ్చు. దీని గురించి మరింత వివరాలు చూస్తే..

Also read: Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో భారీగా ఖాళీల భర్తీ.. పూర్తి వివరాలు ఇలా..

Nokiamob ప్రకారం, నోకియా 25 సంవత్సరాలలో ఐకానిక్ ఫోన్‌ను తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ కొత్త ఫోన్ 1999లో విడుదలైన ఒరిజినల్ నోకియా 3210గా మోడల్ గా తీసుక రాబోతుంది. అయితే ఈ ఫోన్ పాత డిజైన్, కొత్త టెక్నాలజీలని కలిగి ఉంది. లీకైన చిత్రంలో చూపబడిన కొత్త నోకియా 3210.. నిజానికి 2021 నోకియా 6310ని పోలి ఉంటుంది. కొత్త ఫోన్ సరికొత్త కెమెరా లైటింగ్‌ తో వస్తుంది. కొత్త నోకియా లోగో కాకుండా, మీరు వెనుక ప్యానెల్‌ లో HMD లోగోను కూడా చూడవచ్చు. డిజైన్‌తో పాటు, ఈ ఫోన్‌లో ఎక్కువ కాలం ఉండే బ్యాటరీ ఉంది. కొత్తగా వాచ్ మోడల్స్ లో బ్లూటూత్, 4G, మొదలైన కొత్త అప్షనస్ లను చూడవచ్చు. ఇందులో మనలో ఎందరికో ఇష్టమైన పాము ఆట కూడా ఉందండోయ్.. నోకియా 3210 ప్రకారం, ఇది ఒకటిన్నర అంగుళాల స్క్రీన్‌ ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 84×48 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. మొత్తం ఫోన్ పొడవు 123.8mm, వెడల్పు 50.5mm.

Also read: Titanic Watch Action: వేళల్లో కోట్లకి అమ్ముడుబోయిన టైటానిక్ ప్రయాణికుడి వాచ్.. ఎన్ని కోట్లంటే..

ఈ ఫోన్‌లో 40 రకాల రింగ్‌ టోన్‌ లు ఉన్నాయి. వాటిని ఈ ఫోన్‌లో మాత్రమే ప్లే చేయవచ్చు. అదనంగా, మీరు మీకు నచ్చిన రింగ్‌టోన్‌ ను సృష్టించవచ్చు. ఈ ఫోన్‌ లో మెమరీ కార్డ్‌ని పెట్టుకోవడం అసాధ్యం. 3 గేమ్‌ లు ఇందులో పొందుపరిచారు. ఒకసారి ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేస్తే.., ఈ ఫోన్ 55 నుండి 260 గంటల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. టాక్ టైమ్ 180 నుండి 270 నిమిషాల వరకు ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది.