Pet Dog Menace: నగరంలో కుక్కకాటు ఘటనలను అరికట్టేందుకు నోయిడా అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం పెట్ పాలసీకి సవరణలు చేసింది.పెంపుడు కుక్క లేదా పిల్లి ఎవరిపైనైనా దాడి చేస్తే వాటి యజమానులకు రూ.10వేల జరిమానా విధించాలని నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి నిర్ణయించారు. అంతేకాకుండా, వారి పెంపుడు జంతువు వల్ల కలిగే గాయం యొక్క చికిత్స కోసం అన్ని వైద్య ఖర్చులను యజమాని భరించవలసి ఉంటుంది. పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులను జనవరి 31, 2023లోగా నమోదు చేసుకోవడాన్ని కూడా అథారిటీ తప్పనిసరి చేసింది. పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులను నమోదు చేయడంలో విఫలమైతే, వారు రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పెంపుడు జంతువులకు సంబంధించిన పారిశుద్ధ్య సమస్యల విషయంలో కూడా జరిమానా విధించబడుతుంది.
నగరంలో జరుగుతున్న కుక్కల దాడుల వల్లే ఈ సవరణ చేపట్టారు. నోయిడా 207వ బోర్డు సమావేశంలో విధాన రూపకల్పనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోబడ్డాయి. నోయిడా ప్రాంతానికి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి, పాలసీని అథారిటీ నిర్ణయించిందని నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నగరంలో వీధికుక్కలు కాటుకు గురవుతున్న అనేక సందర్భాలు, అనేక సొసైటీలలో కుక్కల ఫీడర్లు, ఇతర నివాసితుల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
Child Save Many Lives: 18 నెలల చిన్నారి.. చాలా మంది ప్రాణాలను కాపాడింది..
గత నెలలో, నోయిడాలోని సెక్టార్ 100లోని రెసిడెన్షియల్ సొసైటీలో వీధికుక్క దాడి చేయడంతో ఏడు నెలల చిన్నారి మరణించింది. దీని వల్ల నివాసితులు నిరసనలు చేపట్టారు. కుక్కల జనాభా పెరుగుదలను పరిష్కరించడానికి పౌర అధికారులు మరింత కృషి చేయాలని డిమాండ్ చేశారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2022 జనవరి నుంచి ఆగస్టు 21 వరకు కుక్కలు దాడి చేసిన 13,690 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటన తాజాగా నమోదైంది. నవంబర్ 09న గ్రేటర్ నోయిడాలోని యూనిటెక్ హోరిజోన్ సొసైటీలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నగరంలో పెరుగుతున్న కుక్కల దాడి నేపథ్యంలో ఘజియాబాద్ పరిపాలన పిట్‌బుల్, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్ అనే మూడు కుక్క జాతులను నిషేధించింది.