Site icon NTV Telugu

Noida: నువ్వు ఎల్తావా మావ?.. రన్నింగ్ బైక్ పై లవర్స్ రొమాన్స్.. ఏకంగా రూ. 53,500 ఫైన్

Bike Lovers Romance

Bike Lovers Romance

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ రకమైన సంఘటన అయినా క్షణాల్లో వైరల్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింటా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏ వీడియో ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై లవర్స్ బైక్ పై వెళ్తూ రొమాన్స్ లో మునిగి తేలారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారి నోయిడా ట్రాఫిక్ పోలీసుల వద్దకు చేరింది. ఇంకేముంది.. చట్టపరంగా పోలీసులు చేయాల్సిన పని చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ బైక్ నంబర్ ఆధారంగా రూ.53,500 ఫైన్ విధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Also Read:Anakapalle Land Pooling: అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాలు.. దూకుడు పెంచిన సీఐడీ !

నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై రన్నింగ్ బైక్ పై ప్రేమ జంటలు రొమాన్స్ చేస్తూ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. పబ్లిక్ ప్లేస్ అన్న సంగతి మర్చిపోయి ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి బుద్ధిమాత్రం మారడం లేదు. నోయిడా-గ్రేటర్ నోయిడా మధ్య ఎక్స్‌ప్రెస్‌వేపై లవ్ బర్డ్స్ చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. బైక్‌పై వెళ్తున్న జంట లోకాన్ని మర్చిపోయి హగ్‌లు, కిస్‌లతో రెచ్చిపోయింది.

Also Read:CM Chandrababu: కుప్పంలో మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!

యువకుడు బైక్ నడుపుతుండగా యువతి అతడి ముందు కూర్చొని గట్టిగా హగ్ చేసుకుంది. బైక్‌పై అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు. వీరి వెనకాలే వచ్చిన మరో వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నోయిడా ట్రాఫిక్ పోలీసుల వద్దకు చేరగా భారీగా జరిమానా విధించి ప్రేమ జంట తిక్క కుదిర్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, పబ్లిక్ కు ఇబ్బంది కలిగేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Exit mobile version