ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది వరకే పలువురు ఉన్నతాధికారులు ఈసీ బదిలీ చేసింది. తాజాగా ఏపీ డీజీపీ కే.వీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి రిలీవ్ అవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డికి తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ఈసీ పేర్కొంది. ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లు పంపాలని ప్రభుత్వానికి ఈసీ సూచించింది. రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
AP Elections 2024: ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..

Ap Dgp