బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే తొలి టెస్టు గురువారం (ఫిబ్రవరి 9) ప్రారంభంకానుంది. ఇప్పటికే రెండు జట్లు నెట్స్‌లో చెమటోడ్చాయి. ముఖ్యంగా భారత్ స్పిన్ పిచ్‌లకే మొగ్గు చూపుతుందన్న కారణంతో ఆసీస్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. ఇక టీమిండియా టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్క సిరీసే మిగిలి ఉంది. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిస్తే రోహిత్‌సేన తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ చాంపియన్ షిప్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. అందుకే తుదిజట్టుపై ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ ఎలెవన్‌పై పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. కెప్టెన్ రోహిత్ కూడా మ్యాచ్‌కు ముందే తుది జట్టుపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపాడు. ఈ క్రమంలో పలువురు మాజీలు జట్టుపై కొన్ని సూచనలు చేస్తున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ కూడా తన టీమ్ ప్రకటించాడు. ఇందులో ఈ సిరీస్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Also Read: INDvsAUS Test : సచిన్ రికార్డుపై కన్ను..టీమిండియా కాదు ఆసీస్ బ్యాటర్‌కే సాధ్యం
ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్‌తో పాటు యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు భజ్జీ. ఇటీవల ఫామ్ చూసుకుని రాహుల్ కంటే గిల్ వైపే మొగ్గు చూపాడు. ఇక తర్వాతి స్థానాల్లో పుజారా, కోహ్లీ, సూర్యకుమార్‌ను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా తెలుగోడు కేఎస్ భరత్‌కు చోటిచ్చాడు. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్‌ను స్పిన్ కోటాలో తీసుకుని కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి చూపాడు. ఇక షమీ, సిరాజ్‌లను పేసర్లుగా ఎంపిక చేశాడు.
భజ్జీ ఫైనల్ ఎలెవన్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రవి అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
My Team india 11 for the first
Test
1- Rohit
2-Gill
3-Pujara
4-Virat
5-Surya
6- Jadeja
7-Bharat
8-Ashwin
9-Axar
10- Shami
11- Siraj #INDvsAUS 🏏 what are ur thoughts guys ?— Harbhajan Turbanator (@harbhajan_singh) February 8, 2023