Cool Water Without Fridge: ఫ్రిడ్జ్ అవసరం లేదు.. ఈ ఒక్క గోనె సంచి చిట్కాతో కూల్ కూల్ వాటర్ తాగొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cool Water Without Fridge: వేసవి కాలంలో సూర్యుడి విజృంభిస్తుంటే.. ఎవ్వరైనా కూల్ కూల్‌గా వాటర్ కావాలని చూస్తున్నారు.. చాలామంది ఇందుకోసం ఫ్రిడ్జ్‌లో నీటిని ఉంచి తాగుతుంటారు. అయితే, పల్లెల్లో ఇప్పటికీ చాలామంది మట్టి కుండలో నీటిని నిల్వ చేసి తాగడం చూస్తుంటాం. ముఖ్యంగా కుండ చుట్టూ తడి గుడ్డ లేదా గోనె సంచి కప్పి ఉంచడం ఒక పాత సంప్రదాయం. ఈ చిన్న చిట్కా వెనుక ఉన్న సైన్స్ తెలుసుకుంటే మీరు కూడా వెంటనే ప్రయత్నించాలనిపిస్తుంది.
మట్టి కుండలో నీరు ఎందుకు చల్లగా ఉంటుంది?
మట్టి కుండ ఉపరితలంపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా లోపల ఉన్న నీరు చాలా స్వల్పంగా బయటికి వచ్చి ఆవిరవుతుంది. ఈ ప్రక్రియను భాష్పీభవనం అంటారు. నీరు ఆవిరయ్యే సమయంలో వేడిని కూడా తీసుకుపోతుంది. అందువల్ల కుండలోని నీరు సహజంగానే చల్లబడుతుంది.
Also Read
- AP Municipal Elections 2026: సవరించిన షెడ్యూల్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు!
- Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
- HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
- FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
గోనె సంచి లేదా తడి గుడ్డ ఎందుకు కడతారు?
కుండ చుట్టూ తడి గుడ్డ లేదా గోనె సంచి కట్టడం వల్ల చల్లదనం మరింత పెరుగుతుంది. గోనె సంచి నీటిని పీల్చుకుని నెమ్మదిగా ఆరిపోతూ ఉంటుంది. దీంతో భాష్పీభవనం వేగంగా జరుగుతుంది. ఫలితంగా కుండలోని నీరు ఇంకా చల్లగా మారుతుంది. ఇంకా ఒక ప్రయోజనం ఏమిటంటే, గోనె సంచి కుండను నేరుగా తాకే ఎండ నుంచి రక్షిస్తుంది. దీంతో కుండ వేడెక్కకుండా నీరు చల్లగానే ఉంటుంది.
ఫ్రిడ్జ్‌కు మంచి ప్రత్యామ్నాయం
విద్యుత్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో లేదా ఫ్రిడ్జ్ లేని ఇళ్లలో ఈ పద్ధతి చాలా ఉపయోగకరం. ఖర్చు తక్కువ, విద్యుత్ అవసరం లేదు, పూర్తిగా సహజమైన విధానం.
ఆరోగ్యానికి కూడా మంచిదే
ఫ్రిడ్జ్‌లోని మరీ చల్లటి నీరు కొందరికి గొంతు సమస్యలు, జలుబు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ మట్టి కుండలోని నీరు శరీరానికి అనుకూలమైన చల్లదనంతో ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి?
ఒక శుభ్రమైన మట్టి కుండ తీసుకోండి.. దానిలో తాగునీరు నింపండి.. తడిపిన గోనె సంచి లేదా గుడ్డతో కప్పండి.. నేరుగా ఎండ తగలని ప్రదేశంలో ఉంచండి.. కొన్ని గంటల్లోనే సహజంగా చల్లబడిన స్వచ్ఛమైన నీరు సిద్ధమవుతుంది. ఈ వేసవిలో ఫ్రిడ్జ్‌పై ఆధారపడకుండా, పాతకాలం తెలివైన ఈ దేశీ చిట్కాను మీరు కూడా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సవరించిన షెడ్యూల్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు!
-
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
-
HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
-
PM Modi: ‘దేశాన్ని పణంగా పెట్టి విఫల ఉత్పత్తిని ప్రమోట్ చేస్తారా?’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
-
FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!