Cockroaches and Ants: ఎలాంటి కెమికల్స్, స్ప్రే లేవు.. ఈ చిట్కాతో ఇంట్లో బొద్దింకలు, చీమలు మాయం.. మళ్లీ వస్తే అడగండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroaches and Ants: వేసవి కాలం వచ్చిందంటే కేవలం ఎండలే కాదు.. ఇంట్లో బొద్దింకలు, చీమల సమస్య కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో ఈ కీటకాలు తేమ, ఆహారం కోసం ఇళ్లలోకి చేరుతాయి. ముఖ్యంగా వంటగది, భోజన టేబుల్, అల్మారాలు, సింక్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. చీమలు ఆహార పదార్థాలను పాడుచేస్తే, బొద్దింకలు మురికిని వ్యాప్తి చేసి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
చాలామంది వీటిని తరిమికొట్టడానికి ఖరీదైన కెమికల్ స్ప్రేలు, పెస్ట్ కంట్రోల్ సేవలను ఆశ్రయిస్తారు. అయితే ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో రసాయనాలు లేకుండానే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
బేకింగ్ సోడా – చక్కెర మిశ్రమం: బేకింగ్ సోడా మరియు పొడి చక్కెరను సమాన మోతాదులో తీసుకుని కలపాలి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని చల్లాలి. చక్కెర వాసనకు అవి ఆకర్షితమవుతాయి. బేకింగ్ సోడా ప్రభావంతో అవి తగ్గిపోతాయి.
వెనిగర్ స్ప్రే: తెల్ల వెనిగర్‌ను నీటితో 1:1 నిష్పత్తిలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. చీమలు వెళ్లే దారుల్లో, మూలల్లో పిచికారీ చేయాలి. వెనిగర్ ఘాటైన వాసన వల్ల చీమలు దారి తప్పి తిరిగి రావడం తగ్గుతుంది.
బోరిక్ ఆమ్లం – పిండి ఉండలు: బోరిక్ ఆమ్లం, చక్కెర, కొద్దిగా పిండిని కలిపి చిన్న ఉండలుగా తయారు చేయాలి. వాటిని సింక్ కింద, అల్మారాల వెనుక, మూలల్లో ఉంచాలి. బొద్దింకలను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బే ఆకులు కూడా బాగా పనిచేస్తాయి: బొద్దింకలకు బే ఆకుల వాసన నచ్చదు. కొన్ని బే ఆకులను నలిపి వంటగది మూలల్లో, అల్మారాల్లో ఉంచితే అవి ఆ ప్రాంతాలకు రావడం తగ్గుతుంది.
పసుపు – దాల్చినచెక్క పొడి: చీమలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో పసుపు లేదా దాల్చినచెక్క పొడిని చల్లాలి. వీటి వాసన చీమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పరిశుభ్రత కూడా ముఖ్యం: ఈ చిట్కాలతో పాటు ఇంటిని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం, చెత్తను వెంటనే తొలగించడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం వల్ల చీమలు, బొద్దింకల సమస్య తగ్గుతుంది. మొత్తంగా ఖరీదైన కెమికల్స్, స్ప్రేలు లేకుండానే ఇంట్లో లభించే సాధారణ వస్తువులతో బొద్దింకలు, చీమలను సులభంగా తరిమికొట్టవచ్చు. ఆరోగ్యానికి హానికరం కాకుండా సహజ పద్ధతుల్లో ఇంటిని కీటకాలు లేకుండా ఉంచుకోవచ్చు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?