Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా గాంధారి మండల కేంద్రంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక లేబర్ కార్డు నమోదు కార్యక్రమం విజయవంతమైంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రభుత్వ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్‌ను చేపట్టారు. హరాలే గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి కమ్రోద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు దిశానిర్దేశం చేశారు.
కార్మిక కార్డు కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ప్రమాద బీమా, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. కేవలం కొత్త కార్డుల జారీనే కాకుండా, గడువు ముగిసి నిలిచిపోయిన పాత కార్డుల రెన్యువల్ ప్రక్రియను కూడా అక్కడికక్కడే పూర్తి చేశారు.
Also Read
- Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
- AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
- Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
- Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మమ్మాయి రేణుకా సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ, మండలంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ కార్డులు అందేలా గ్రామపంచాయతీ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, ఏ ఒక్క కార్మికుడు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.18 నుండి 60 ఏళ్ల లోపు ఉండి, భవన నిర్మాణ మరియు ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరణిస్తే బీమా సౌకర్యం, వివాహ కానుక, ప్రసూతి సాయం.. పిల్లల చదువుల కోసం ఆర్థిక సాయం అందజేస్తారు.
తాజావార్తలు
-
Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!