Site icon NTV Telugu

Nishant Kumar: రాజకీయాల్లోకి సీఎం కొడుకు..

Nishant

Nishant

Nishant Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభం అయ్యాయి. నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనను సత్కరిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన విజయంగా జేడీయూ అభివర్ణించింది. ఈ గౌరవం మొత్తం బీహార్‌కు గర్వకారణమైన క్షణం అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ అన్నారు. ఇదే క్రమంలో సీఎం కుమారుడు నిశాంత్ కుమార్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆయన సూచించారు.

READ ALSO: Pragathi : టాలీవుడ్’కి ప్రౌడ్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్‌లో పవర్ లిఫ్టింగ్ కోసం నటి ప్రగతి ఎంపిక

దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఒక్కసారిగా వార్తల్లో్కి ఎక్కారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నిశాంత్ మాట్లాడుతూ..”ఇది ప్రజల ఆశీర్వాదం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము” అని అన్నారు. తాజా సంజయ్ ఝా మాట్లాడుతూ.. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఆయన పార్టీలో ఎప్పుడు చేరాలో నిర్ణయించుకోవడం ఆయన ఇష్టం అని అన్నారు. దీంతో ఏకకాలంలో నితీష్, నిశాంత్‌ల పేర్లు బీహార్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి నుంచే తదుపరి తరం నాయకత్వ వారసత్వం గురించి జేడీయూలో చర్చలు ప్రారంభమయ్యాయి.

READ ALSO: Indian Airlines: భారత్‌ ఎయిర్‌లైన్స్ ఒక్కొక్కటిగా కుప్పకూలిపోడానికి కారణాలు ఇవే..

Exit mobile version