NTV Telugu Site icon

Jayam : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ క్లాసిక్ మూవీ..

Jayam

Jayam

Jayam : టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నితిన్ నటించిన సినిమాలలో తన మొదటి సినిమా “జయం” క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిపోయింది.ఈ సినిమా 2002 జూన్ 14 న రిలీజ్ అయింది.ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ గా నిలిచింది.చిత్రం ,నువ్వునేను సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నదర్శకుడు తేజ అంతా కొత్త వారితో జయం సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా సమయంలో నితిన్ కు 18 సంవత్సరాలు మాత్రమే .ఈసినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా సదా అద్భుతంగా నటించింది.ఇక విలన్ గా గోపీచంద్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ అందించిన పాటలు ఇప్పటికి ట్రెండ్ అవుతూనే వున్నాయి.ఈ సినిమాతో హీరోగా నితిన్ కు మంచి గుర్తింపు లభించింది.ఈ సినిమాలోని నటీనటులందరికి జయం సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయి నేటికీ 22 ఏళ్ళు పూర్తి అయింది.

Read Also :Kannappa : కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..

ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ జయం సినిమా వచ్చి అప్పుడే 22 ఏళ్ళు పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు.ఈ సినిమాకు నా హృదయంలో ప్రత్యేకమైన స్తానం వుంది.ఈ చిత్రం తెరకెక్కించినందుకు డైరెక్టర్ తేజకు ధన్యవాదాలు అని నితిన్ తెలిపారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.నితిన్ ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తమ్ముడు”.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు మరియు శిరీష్ సంయుక్తగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే నితిన్ నటిస్తున్న మరో మూవీ “రాబిన్ హుడ్”ఈ సినిమాను తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.