Site icon NTV Telugu

Nitin Gadkari: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ను కొనియాడిన నితిన్ గడ్కరీ..

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: ఈ సభకు వచ్చిన అందరికీ తెలుగులో నమస్కారం చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని దాదాపు రూ. 5వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమెరికాలో ఉన్న రోడ్ల వెళ్లే అమెరికా రిచ్ అయిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళ్తోందన్నారు.. చంద్రబాబు విజన్ ఉన్న నేత.. ఎప్పటికీ ఆదర్శంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో షిప్పింగ్ వల్ల ఎంతో అభివృద్ధి చెందుతోంది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏపీని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. చంద్రబాబు తను సీఎంగా దేశానికి విజన్ చూపారని.. భవిష్యత్తు పై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. నాలెడ్జిని వెల్త్ గా మార్చేదే విజన్ అని.. చంద్రబాబు డెవలెప్మెంట్ విజన్ పట్ల ఆయనను అభినందించాలన్నారు.

READ MORE: Saina Nehwal: నెల క్రితమే విడాకులు.. శుభవార్త చెప్పిన సైనా నెహ్వాల్!

నేను షిప్పింగ్ మంత్రిగా ఉన్నప్పుడు తన వద్ద రూ. 9వేల కోట్లు బడ్జెట్ ఉంటే రూ.12 లక్షల కోట్లు పనులు చేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పోర్టు ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని.. దీంతో బస్సు, రైలు కన్నా జలమార్గంలో చాలా ఖర్చు తగ్గుతుందన్నారు. ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ 16శాతం ఉంటే చైనాలో 8 శాతం అమెరికాలో 12 శాతం ఉందన్నారు. మనం 9 శాతం లాజిస్టిక్ కాస్టుకు వస్తే ఉద్యోగాలు వస్తాయి.. ఎగుమతులు పెరుగుతాయని తెలిపారు. దేశం రోడ్డు నెట్వర్కు విషయంలో ఏపీలో ఎంతో వర్కు చేశామన్నారు. ఏపీలో లక్ష కోట్ల పనులు చేశాం.. రెండు నెలల్లోనే అమెరికాతో సమానంగా రోడ్లు తయారు అవుతాయన్నారు. నాగపూర్-జబల్ పూర్ మధ్య పశుగ్రాసంను బిటమిన్ గా మార్చి కిలోమీటర్ రోడ్డు వేశామని.. అది పెట్రోలియం ప్రాజెక్టుతో వేసిన రోడ్డు కంటే బెటర్ అని నిపుణులు తేల్చినట్లు వెల్లడించారు.

READ MORE: Question Hour With MLC Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో క్వశ్చన్ అవర్

“నాయకత్వం, ప్రభుత్వం మంచిగా ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతోంది. పోలవరానికి హెలికాప్టర్ లో వెళ్లినప్పడు ఎంతో నీరు సముద్రంలో కలిసిపోతుంది అని చూశాం. అమెరికా సాటిలైట్ తో ఏఐ వాడి మా గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాం. దేశ ఆర్థికవృద్ధిలో 22శాతం వ్యవసాయం నుంచి వస్తోంది. రోడ్లు బాగా వేయాలనే బాధ్యత ప్రధాని నాకు ఇచ్చారు.. నేను ఇంజీనీర్‌ని కాదు. గోదావరి నుంచి కావేరి వరకూ నీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ దేశంలో పుష్కలంగా నీరు ఉంది.. నీటి వినియోగం సరిగా లేదు. నా వద్ద ఏపీకి సంబంధించి అతిపెద్ద లిస్టు ఉంది.. వెబ్ సైట్లో వాటి వివరాలు(రోడ్లు ప్రాజెక్టు గురించి) ఉంచుతాం. ఏపీలో కూడా యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కువే. యాక్సిడెంట్ విషయంలో చాలా ముందు ఉంది. ప్రతి జిల్లాలో వాటిని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.” అని నితిన్ గడ్కరి వ్యాఖ్యానించారు.

Exit mobile version