Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: “ఎవడైనా కులం గురించి మాట్లాడితే వాడికి గట్టిగా తన్నులు పడతాయి” (జో కరేగా జాత్ కీ బాత్, ఉస్కో మారుంగా కస్ కే లాత్) అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాజాగా నాగ్‌పూర్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని కులమతాల పేరుతో విభజించే రాజకీయ నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, ఎవడైనా కులం గురించి మాట్లాడితే వాడికి గట్టిగా తన్నులు పడతాయంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. అభివృద్ధికి కులమతాలు ఉండవని, ప్రభుత్వం అందించే గ్యాస్, పెట్రోల్ లేదా డీజిల్ వంటి సౌకర్యాలు హిందువులకు ఏ ధరకైతే లభిస్తాయో, ముస్లింలకూ అదే ధరకు అందుతాయని గుర్తుచేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నప్పుడు, ఈ కుల రాజకీయాలతో ఒరిగేదేమీ లేదని కుండబద్దలు కొట్టారు.
ఈ సందర్భంగా రాజకీయాల్లో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను సైతం గడ్కరీ ఎండగట్టారు. వేదికలపై కులాల గురించి ఊదరగొట్టే కొందరు నేతలు, వ్యక్తిగతంగా తనను కలిసినప్పుడు మాత్రం తమ భార్యలకో, కొడుకులకో రాజకీయ టిక్కెట్లు ఇప్పించమని అడుగుతుంటారని, ఇలాంటి దొంగ వేషాలు వేసే నాయకులను ప్రజలు ఇప్పటికే గుర్తించారని విమర్శించారు. తాను ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు చెబుతానని, తాను చెప్పిన పనిని చేయలేదని ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాల గురించే కాకుండా, దేశ నిర్మాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా ప్రశంసించారు. భారతదేశ ప్రగతి కేవలం యంత్రాల వల్ల సాధ్యం కాలేదని, దేశంలోని లక్షలాది మంది కార్మికుల రక్తం, చెమట వల్లనే ఈ అద్భుతమైన రహదారులు, భవనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశాభివృద్ధికి వెన్నెముక వంటి కార్మికులకు సరైన గౌరవం, అవకాశాలు కల్పించడం ద్వారానే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!