Site icon NTV Telugu

Nithya Menen : ఆమె తన మాటలతో నన్ను ఇబ్బంది పెట్టేది..

Whatsapp Image 2023 10 22 At 11.53.35 Am

Whatsapp Image 2023 10 22 At 11.53.35 Am

సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్య మీనన్ చేసే సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి మరి.సింగర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ బిగినింగ్ నుంచి కొన్ని నియమాలతో లోబడే ఆమె సినిమాలు చేస్తూ వస్తుంది.నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతుంది నిత్యమీనన్. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేయకూడదని ఆమె భావిస్తు ఉంటుంది.నటనతోనే రానిస్తుంది ఈ కేరళ బ్యూటీ.తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన నిత్య.. ఈమధ్య కాస్త జోరు తగ్గించింది. తక్కువ సినిమాలు చేసినా కూడా తన కెరీర్ గుర్తుండిపోయే సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె శ్రీమతి కుమారి అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సాధించింది.అయితే ఈ వెబ్ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో.. సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు మూవీ టీమ్.

ఇక ఈ వెబ్ మూవీకి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది నిత్యా మీనన్. అందులో తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేసారు.. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన పేరెంట్స్ తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని ఆమె తెలిపింది. తన పెళ్లి విషయంలో కూడా ఎప్పుడూ వారు ఒత్తిడి తీసుకురాకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్పింది..తన ఇంట్లో కాని.. బయట కానీ తనపై ప్రెజర్ తెచ్చేవారు ఎవరూ లేరు ఆమె తెలిపారు.కాని.. తన బామ్మ మాత్రం తనను అస్సలు హీరోయిన్ గా చూడదని తెలిపింది.. తనకు వాల్యూ ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెట్టేదన్నారు నిత్య. సూటి పోటి మాటలతో ఎప్పుడు ఇబ్బంది పెట్టేదట. ఇన్నేళ్ల వయసు వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ వేధించుకుని తినేదట నిత్య భామ్మ.కనీసం తననో నటిగా కూడా గుర్తించేది కాదట.ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్.. త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా.. అంటూ .. మాటలతో ఇబ్బంది పెట్టేదట. ఇక ఆమె తప్పితే తనను ఇంత వరకూ అనే ధైర్యం ఎవరూ కూడా చేయలేదు అని చెప్పుకొచ్చింది నిత్య మీనన్.

Exit mobile version