టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థతో చేతులు కలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటేనే క్వాలిటీ మరియు కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ వినోదాత్మక ఫ్యామిలీ డ్రామా కోసం కథానాయికగా ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్‌ను ఖరారు చేసినట్లు తాజా సమాచారం.
గతేడాది విడుదలైన ‘మిరాయ్’ చిత్రంతో రితికా నాయక్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె వరుణ్ తేజ్ సరసన ‘కొరియన్ కనకరాజు’ వంటి విభిన్నమైన చిత్రంలో నటిస్తుండగా, ఇప్పుడు నితిన్ సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. నితిన్-రితికా జోడీ వెండితెరపై సరికొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే తొలి వారం నుండి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు, టైటిల్, ఇతర నటీనటుల గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
