Site icon NTV Telugu

Nithin: ఒకేసారి మూడు సినిమాలతో నితిన్ జోరు!

Nithin

Nithin

బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ లు అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ అందించారు. ఇప్పటికే వి.ఐ. ఆనంద్‌తో ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను ప్రకటించిన నితిన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. అయితే వీటన్నింటికంటే మిన్నగా, గతేడాది ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ డైరెక్టర్ అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడటంతో నితిన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read : Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్ అప్‌డేట్..

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యి..రూటు మార్చి మరి విభిన్న జానర్లను ఎంచుకుంటున్నారు. ‘ఆయ్’ సినిమాలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో హిలేరియస్ కామెడీని పండించిన అంజి మణిపుత్ర, ఇప్పుడు నితిన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ మూడు సినిమాల ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ షూటింగ్ షెడ్యూల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తనికి ఒకేసారి ఒకేసారి మూడు వైవిధ్యమైన సినిమాలను ప్రకటించి నితిన్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

Exit mobile version