NTV Telugu Site icon

Nirmala Sitaraman: నిర్మలమ్మ చమ్మక్కులు.. నవ్వుకున్న సభ్యులు

Products

Products

Nirmala Sitaraman: ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్ ప‌దాన్ని త‌ప్పుగా ప‌లికారు. దీంతో లోక్‌స‌భ‌లో న‌వ్వులు పూశాయి. వెహికిల్ స్క్రాపింగ్ పాల‌సీ గురించి ఆమె ప్రకటన చేస్తూ .. పాత క‌లుషిత వాహ‌నాల‌ను రిప్లేస్ చేస్తున్నామ‌ని చెప్పే స‌మ‌యంలో ఓల్డ్ పొల్యూటింగ్ కు బదులుగా .. ఓల్డ్ పొలిటిక‌ల్ అని ప‌లికారు. ఆ త‌ర్వాత వెంట‌నే సారీ చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. అయితే పొల్యూటింగ్ ప‌దం స్థానంలో పొలిటిక‌ల్ అని మంత్రి ప‌ల‌క‌డంతో స‌భ్యులు నవ్వేశారు. వెహికిల్ రిప్లేస్‌మెంట్ పాల‌సీ అతిముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఇంగ్లీష్ ప‌దాన్ని త‌ప్పుగా ప‌లికిన ఆమె త‌న పొర‌పాటును గుర్తించి చిరున‌వ్వు న‌వ్వారు. ఇక పొలిటిక‌ల్ ప‌దం వాడిన సంద‌ర్భంలో ప‌లుమార్లు పొల్యూటింగ్ ప‌దాన్ని వినిపించారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ విధానంలో భాగంగా వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్ని చేప‌డుతున్నట్లు ఆమె చెప్పారు.

ఇప్పటికే సీఎంలకు లేఖలు :
15 ఏళ్లకు పైగా రోడ్లపై తిరుగుతున్న అన్ని రకాల వాహనాలను నిషేధిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్‌ 1 నుంచి ఈ వాహనాలన్నీ కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖ బస్సులు, ఆర్టీసీ, ఇతర వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కారణంగా పాత వాహనాలను తక్కుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన పాలసీకి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించడంతో పాటు ప్రతీ రాష్ట్ర్రంలోనూ వెహికిల్‌ స్క్రాపేజి పాలసీని రూపొందించి అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.