NTV Telugu Site icon

Budget 2024 : మోడీ మరో కానుక …’పూర్వోదయ’ పథకం ఏపీ, బీహార్ కి కూడా వర్తింపు

New Project 2024 07 23t125101.648

New Project 2024 07 23t125101.648

Budget 2024 : ఈ సారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ లో ఏపీకి వరాలు కురిశాయి. కాసేపటి క్రితమే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ…. ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్న పూర్వోదయ పథకం ఆంధ్రా, బీహార్ రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా…. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం అందించబోతున్నట్లు కూడా ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌. అటు పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తామని వెల్లడించారు. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుకు సాయం చేస్తామన్నారు. అవసరాన్ని బట్టి అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామన్నారు. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తామన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ పురర్ వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలోనే బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ ప్రణాళికను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.21,400 కోట్ల వ్యయంతో పీర్ పాయింటి వద్ద 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. బీహార్ లో కొత్త విమానాశ్రయాలు , వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు. బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల నుంచి బాహ్య సహాయం కోసం బీహార్ ప్రభుత్వ అభ్యర్థనలను వేగవంతం చేయనున్నారు. బీహార్ లోని గయ నగరాన్ని తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్ గా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాట్నా – పూర్ణియా ఎక్స్‌ప్రెస్ వే, బక్సర్ – భాగల్పూర్ హైవే, బోధ్గయా – రాజ్గిర్ – వైశాలి – దర్భాంగా, బక్సర్లో గంగా నదిపై రూ. 26,000 కోట్లతో అదనపు రెండు వరుసల వంతెన అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తామని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారు. అలాగే ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. టూరిజంలో భాగంగా టెంపుల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నలంద యూనివర్శిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

పూర్వోదయ పథకం అంటే ఏంటి ?
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్ ద్వారా తూర్పు భారతదేశం అభివృద్ధి కోసం కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్వోదయ పథకాన్ని ప్రారంభించారు. 12 జనవరి 2020న ఈ పథకాన్ని ఆవిష్కరించారు. మిషన్ పూర్వోదయ సమగ్ర స్టీల్ హబ్ ఏర్పాటు ద్వారా తూర్పు భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలు (ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్) , దేశంలోని 80శాతం ఇనుప ఖనిజం, 100శాతం కోకింగ్ బొగ్గు, గణనీయమైన క్రోమైట్‌, బాక్సైట్, డోలమైట్ నిల్వలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర భాగంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఈ హబ్ లక్ష్యం ఉక్కు ఉత్పత్తిదారుల మొత్తం పోటీతత్వాన్ని ఖర్చు, నాణ్యత పరంగా మెరుగుపరచడం. ఈ మిషన్ తూర్పు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలనే ప్రధాన మంత్రి దృష్టికి అనుగుణంగా అమల్లోకి తీసుకొచ్చారు. 2030 నాటికి జాతీయ ఉక్కు విధా ఊహించిన సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని (MTPA) సాధించడానికి ఈ పథకం దోహదం చేస్తుంది.

పూర్వోదయ మిషన్ కోసం తూర్పు భారతదేశమే ఎందుకు?
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో 2 వ అతిపెద్దది. 2030-31 నాటికి 300 మిలియన్ టన్నుల సామర్థ్యంలో 200 మిలియన్ టన్నులకు పైగా ఈ ప్రాంతం నుంచే రావచ్చని అంచనా. దేశంలోనే అత్యధికంగా ఉక్కు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఒడిశా. ఒడిశా ఖనిజాలలో హెమటైట్స్ పుష్కలంగా ఉన్నాయి. తూర్పు భారతదేశం అనంతమైన అవకాశాల భూమి, సహజ వనరులను కలిగి ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఉక్కు రంగంలో మిషన్ పూర్వోదయతో తూర్పు భారతదేశంలో అభివృద్ధి జరుగుతుంది. భారత ప్రభుత్వం పూర్వోదయ ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉక్కు రంగం వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.