Site icon NTV Telugu

FM Nirmala Sitharaman Birthday: హ్యాపీ బర్త్ డే నిర్మలా మేడమ్..

Nirmala Sitharaman Birthday Today

Nirmala Sitharaman Birthday Today

FM Nirmala Sitharaman Birthday: దేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు 64ఏళ్లు నిండాయి. భారతదేశపు మొదటి పూర్తికాల ఆర్థిక మంత్రిగా 30 మే 2019 నుండి ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. నేడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పుట్టినరోజు సందర్భంగా తన రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం.. నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వ మొదటి టర్మ్‌లో రక్షణ మంత్రిగా పనిచేశారు. సెప్టెంబర్ 2017 నుండి మే 2019 వరకు ఆమె దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దీని తరువాత 2019 మేలో మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమెకు ఆర్థిక మంత్రిత్వ శాఖ లభించింది.

రాజకీయ జీవిత విజయాలు
నిర్మలా సీతారామన్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా 2003 నుండి 2005 సంవత్సరాలలో పనిచేశారు. ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. 3 సెప్టెంబర్ 2017 న తను దేశ రక్షణ మంత్రిగా ఘనతను సాధించారు. ఈ విధంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ స్వతంత్ర భారతదేశానికి రెండవ మహిళా నాయకురాలిగా దేశ రక్షణ మంత్రిత్వ శాఖను, స్వతంత్రంగా మొదటి పూర్తికాల మహిళా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది కాకుండా తాను 26 మే 2014 నుండి 3 సెప్టెంబర్ 2017 వరకు భారతదేశ వాణిజ్యం, పరిశ్రమల, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు.

ఆర్థిక మంత్రి జీవిత చరిత్ర
నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1980లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆ తర్వాత ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎం ఫిల్ చేశారు. నిర్మలా సీతారామన్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్‌తో సీనియర్ మేనేజర్ (రీసెర్చ్ & అనలిస్ట్)గా కూడా పనిచేశారు. బీబీసీ వరల్డ్ కోసం కూడా కొంతకాలం పనిచేశారు. తాను లండన్‌లోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లో అసిస్టెంట్ ఎకనామిస్ట్‌గా పనిచేశాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తాను సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ స్టడీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.

నిర్మలా సీతారామన్ వ్యక్తిగత జీవితం
నిర్మలా సీతారామన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ , భారతదేశానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ పూర్వ విద్యార్థి డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకున్నారు. నిర్మలా సీతారామన్ భర్త రైట్ ఫోలియో కంపెనీలో ఎండీగా ఉన్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం కూడా వినిపిస్తోంది. నిజానికి, ఆమె భర్త డాక్టర్ పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ ఇద్దరూ గతంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అక్కడ ప్రేమ చిగురించి ఆ తర్వాత ప్రేమ పెళ్లిగా మారింది. వారికి ఒక కూతురు ఉంది. పెళ్లయ్యాక ఇద్దరూ లండన్‌కు మారారు. కూతురు పుట్టిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Exit mobile version