Site icon NTV Telugu

“NIPPO” తన స్వర్ణోత్సవ వేడుక వేదికగా సరికొత్త “Brand logo” ఆవిష్కరణ

Nippo

Nippo

ప్రముఖ పారిశ్రామికవేత్త, దార్శనికులైన శ్రీ. P. Obul reddy గారి ఆధ్వర్యంలో జపానికి చెందిన Matsushita ElectricIndustrial Coతో కలసి “Joint venture”గా 1972లో INL (Indo national LTD) స్థాపించబడింది.
70వ దశకంలో ప్రారంభమైన నాటి నుంచి “NIPPO” ప్రతి భారతీయ కుటుంబంలో “Battery”కి పర్యాయపదంగా మారిపోయింది. “NIPPO” తన అత్యుత్తమ నాణ్యత మరియు పనితీరుతో భారతీయ మార్కెట్లో గత ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక స్థానం పొందింది.

1973లో INL యొక్క మొదటి కర్మాగారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో స్థాపించబడింది. NIPPO – Hyper Battery మొదటి ప్రోడక్ట్ (ఉత్పత్తి)గా ఉంది. అనతికాలంలోనే NIPPO ప్రజల దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేకించి, గ్రామీణ వినియోగదారులు NIPPO అత్యుత్తమ పనితీరు మరియు అందుబాటు ధరల కారణంగా విశేషంగా ఆదరించారు. అప్పటి నుంచి NIPPO వెనుతిరిగి చూడలేదు.

గత ఐదు దశాబ్దాలుగా NIPPO తన బ్రాండ్ ద్వారా అనేక నూతన ఆవిష్కరణలతో మార్కెట్ను విస్తరిస్తూ నేడు. Batteries. Torches Mosquito bats, LED lights & Electrical accessories అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశంలో విడిభాగాల తయారీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న “Kineco Ltd”లో పెట్టుబడుల ద్వారా IN తన Batteries మరియు Lighting వ్యాపారం దాటి B2B & B2G వరకు విస్తరించింది.

NIPPO తన సరికొత్త లోగో ఆవిష్కరించింది. 50వ ఆవిర్భావ సంవత్సరంలో NIPPO బ్రాండ్ గుర్తింపుని ప్రతిబింబిస్తుంది. నూతన NIPPO Logo నవీనంగా, సమకాలీనతతో వినియోగదారులను ఉత్తేజింపజేస్తుంది. ఇంకా తన ప్రస్తుత మరియు భవిష్య ఉత్పత్తులకు కొత్త వినియోగదారులను చేరువ చేస్తుంది.

సంస్థ Joint Managing Director శ్రీ ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ “50వ సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక జరుపుకుంటూ మేము ఉత్సాహవంతమైన మరియు ముఖ్యమైన దశకి చేరుకున్నాము. మా ప్రధానమైన ఉత్పత్తులని దాటి భారత ప్రజలు అందించే అవకాశాలు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.

సంస్థ Managing Director శ్రీ ద్వారకానాధ్ రెడ్డి ఉత్సాహంగా మాట్లాడుతూ “INL తన సుదీర్ఘ దశాబ్దాల ప్రయాణం ద్వారా 50 సం||లు పూర్తి చేసుకున్న సందర్భం చాలా సంతోషాన్నిచ్చింది. NIPPO మరింతగా విస్తరించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నాము” అని అన్నారు.

Exit mobile version