Site icon NTV Telugu

Pollachi s*ex racket: కోయంబత్తూరు మహిళా కోర్టు సంచలన తీర్పు.. పొల్లాచ్చి సె*క్స్ రాకెట్ లో తొమ్మిది మందికి జీవిత ఖైదు

Pollachi

Pollachi

ఆరు సంవత్సరాల క్రితం తమిళనాడును కుదిపేసిన పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో తొమ్మిది మందిని దోషులుగా తేల్చుతూ కోయంబత్తూరులోని మహిళా కోర్టు మే 13న మంగళవారం తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఆర్ నందిని దేవి తీర్పు వెల్లడించారు. సామూహిక అత్యాచారం కేసులో పురుషులను దోషులుగా నిర్ధారించారు. పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది కోయంబత్తూరు మహిళ కోర్టు. మరణం వరకు జీవిత ఖైదు విధించింది కోర్టు. బాధిత మహిళలకు 85 లక్షల పరిహారం ‌ఇవ్వాలని ఆదేశించింది.

Also Read:Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు అరెస్టు!

2019లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపినా పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు. పూర్తి స్దాయి లో విచారణ చేపట్టింది సిబిఐ‌‌‌. తొమ్మిది మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. మొత్తం 9 మంది నిందితులు నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, పదేపదే అత్యాచారం వంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. తొమ్మిది మందిని దోషులుగా తేల్చింది కోర్టు.

Also Read:Shopian gunfight: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఫేస్ బుక్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, ప్రేమిస్తున్నానంటూ వారిపై అత్యాచారాలకు పాల్పడటం, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కి పాల్పడం, ఎవరికైనా విషయం చెబితే ఇంటర్నెట్ లో వీడియో అప్ లోడ్ చేస్తామని వందలాది యువతులను బెదిరించింది ముఠా. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఎన్ శబరిరాజన్ అలియాస్ రిష్వంత్, కె తిరునావుక్కరసు, ఎం సతీష్, టి వసంతకుమార్, ఆర్ మణి అలియాస్ మణివణ్ణన్, పి బాబు, టి హరోనిమస్ పాల్, కె అరుళానందం, ఎం అరుణ్‌కుమార్.

Exit mobile version