Site icon NTV Telugu

Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటా

Nikki

Nikki

Nikki Haley: ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ 2024లో జరగబోవు అమెరికా అధ్యక్ష్య ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్కరే రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు. తాజాగా నిక్కీ హేలీ కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఆమె కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.

Read Also: Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

తాజా పరిణామంతో తన మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు నిక్కీ హేలీ ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్‌ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌ గాను, ఐక్యారాజ్య సమితిలో అమెరికా రాయబారిగాను పనిచేశారు. ట్రంప్‌ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు. నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్‌ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్‌ సింగ్‌ రన్‌ధావా, రాజ్‌ కౌర్‌ రన్‌ధావా. పంజాబ్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్‌ సింగ్‌ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు.

Exit mobile version