Niharika New movie to have Committee Kurrallu as title: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక గతంలో హీరోయిన్ గా పరిచయమైంది కానీ ఎక్కువగా నిర్మాతగానే సినిమాలు చేస్తూ వస్తోంది. హీరోయిన్గా చేసిన ఒకటి రెండు సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో నిర్మాణం వైపే మొగ్గు చూపుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసి పలు సినిమాలు నిర్మిస్తూ ఆల్రెడీ నిర్మించిన పలు సినిమాలను ప్రమోట్ చేస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె గత ఏడాది యదు వంశీ అనే కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద నిహారిక తల్లి పద్మజ, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకి ‘కమిటీ కుర్రాళ్లు’ టైటిల్ ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే టీమ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ మేరకు ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారని, అఫీషియల్ గా చెప్పకపోయినా అది ఈ సినిమా కోసమేనని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా హీరోయిన్లు కూడా ఎక్కువగా ఉండే ఉంటారని టాక్ వినిపిస్తోంది. దాదాపు ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ఇప్పటివరకు సింగర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనుదీప్ దేవ్ సంగీతం అందించబోతున్నారు.