Site icon NTV Telugu

Niharika : ఇదే నిజమైన హ్యాపీనెస్ అంటూ నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్

Niharika Konidela

Niharika Konidela

మెగా డాటర్ నిహారిక కొణిదెల అంటే కేవలం నటి, నిర్మాత మాత్రమే కాదు.. తనకి నచ్చినట్లుగా జీవితాన్ని ఆస్వాదించే ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. నిత్యం కెమెరాల ముందు, షూటింగ్ సెట్స్, ఆఫీస్ పని ఒత్తిడిలో బిజీగా ఉండే నిహారిక.. తాజాగా ఆ ఒత్తిడికి కాస్త బ్రేక్ ఇచ్చి తన మనసుకి ప్రశాంతతని ఇచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని అద్భుతమైన మేఘాలయా కొండల్లో ఆమె ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి పచ్చని ప్రకృతి, చల్లని గాలుల ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో

Also Read : The Raja Saab: ప్రభాస్ ఎప్పుడు వారి గురించే ఆలోచిస్తారు.. మారుతి ఎమోషనల్ కామెంట్స్!

తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఆమె ఎంత ఎమోషనల్ అయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆకాశంలో రంగులు మారుస్తూ కరిగిపోతున్న సూర్యాస్తమయాన్ని (సన్‌సెట్) చూస్తూ ఆమె మురిసిపోయారు.. ‘సన్‌సెట్‌ను వెంటాడుతూ నా హృదయానికి కావాల్సిన అసలైన ఆనందాన్ని ఇచ్చుకుంటున్నాను’ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ముందు నుండి కూడా ప్రయాణాలు అంటే నిహారికకు ఎంతో ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి అందమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ‘నీ చిరునవ్వు ఇలాగే ఎప్పుడూ ఉండాలి’ ‘నీ సంతోషమే మాకు కావాలి నిహా’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. మొత్తానికి మెగా డాటర్ తన టైమ్ చాలా క్వాలిటీగా గడుపుతున్నారని ఈ ఫోటోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

 

Exit mobile version