NTV Telugu Site icon

Nigeria : నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రదాడి..100 మందికి పైగా మృతి

New Project (11)

New Project (11)

Nigeria : ఈశాన్య నైజీరియాలో అనుమానిత బోకో హరామ్ తీవ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. కనీసం 100 మంది గ్రామస్థులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం యోబెలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 మందికి పైగా ఉగ్రమూకలు బైక్‌లపై వచ్చి తొలుత కాల్పులు జరిపి ఆ తర్వాత భవనానికి నిప్పంటించారు. ఈ దాడిలో 34 మంది మరణించారని యోబే డిప్యూటీ గవర్నర్ ఇడి బర్డే గుబానా తెలిపారు. అయితే స్థానిక నేత జానా ఒమర్ ప్రకారం వాస్తవ సంఖ్య 102. అధికారులు రాకముందే చాలా మందిని ఖననం చేశారని లేదా వారి మృతదేహాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆయన అన్నారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారని, వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని ఉమర్ చెప్పారు.

Read Also:Varaha Jayanti: వరాహ జయంతి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ కుటుంబం,వ్యాపారం అంతా బాగుంటుంది

అత్యంత ఘోరమైన దాడులలో ఒకటి
ఈ దాడికి బాధ్యత వహిస్తూ, గ్రామస్థులు తమ కార్యకలాపాల గురించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించినందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లు ఉగ్రవాదులు తెలిపారు. నైజీరియాలో పెరుగుతున్న అభద్రత, తీవ్రవాద పరిస్థితిని ప్రతిబింబించే ఈ దాడి గత సంవత్సరంలో జరిగిన ఘోరమైన దాడులలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Read Also:Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

బోకో హరామ్ అంటే ఏమిటి?
బోకో హరామ్ ఒక ఇస్లామిక్ తీవ్రవాద సమూహం. ఇది 2002లో స్థాపించబడింది. నైజీరియాలో షరియా చట్టాన్ని అమలు చేయడం, పాశ్చాత్య విద్యను వ్యతిరేకించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ గుంపు గత 10 సంవత్సరాలలో వేలాది మందిని చంపింది. లక్షల మందిని నిర్వాసితులను చేసింది. బోకోహరమ్ దాడులు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పాఠశాలలు, మత స్థలాలపై కూడా జరుగుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన, అభద్రతా వాతావరణం నెలకొంది. నైజీరియా ప్రభుత్వం, భద్రతా దళాలు ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి, అయితే పరిస్థితిని మెరుగుపరచడం కష్టంగా మారుతోంది. స్థానిక సంఘాలకు భద్రత కల్పించడంతోపాటు దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

Show comments