Nidhi Agarwal: సినిమాల్లో ప్రతిభ చూసిన ఎవరూ అవకాశం ఇవ్వడం లేదంటూ హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు దక్కకపోవడంపై నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం అందం మాత్రమే చూస్తున్నారు. ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్నారంటే నేను నమ్మను. ఇక్కడ ఎక్స్‌పోజింగ్ చేస్తేనే ఛాన్స్‌లు వస్తాయి. అలానే అందరూ ఉన్నారని అనడం లేదు. టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చేవారు ఓ 20% మంది ఉంటారు. ఇక నాలాంటి వారికి పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్స్‌లు లభిస్తున్నాయంటే దానికి కారణం.. తక్కువ రెమ్యునరేషన్. నేను పెద్దగా రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేయను’’ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
Read Also: Malaika Arora : వయసులో చిన్నవాడు.. తప్పేంటి అంటున్న ముదురు భామ
తన ఫస్ట్ సినిమాలో శింబు సరసన నటించిన ఈ అమ్మడు.. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నా.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకి పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో నాగ చైతన్యతో చేసిన సవ్యసాచి, అఖిల్‌తో చేసిన మిస్టర్ మజ్ను ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. అలానే కోలీవుడ్‌లో జయం రవితో చేసిన భూమి సినిమా కూడా డిజాస్టర్. దాంతో నిధి అగర్వాల్ కెరీర్ స్లో అయ్యింది. కానీ తాజాగా ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న ఈ అమ్మడు కెరీర్ మళ్లీ పట్టాలెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాపై నిధి అగర్వాల్ గంపెడాశలు పెట్టుకుంది.
