NTV Telugu Site icon

Nidhi Agarwal : సైమా ఈవెంట్ లో స్టన్నింగ్ లుక్ లో మెరిసిన ఇస్మార్ట్ బ్యూటీ..

Whatsapp Image 2023 09 16 At 1.18.30 Pm

Whatsapp Image 2023 09 16 At 1.18.30 Pm

నిధి అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మతి పోగొట్టే సొగసు తో యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. నాగ చైతన్య హీరో గా నటించిన సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత గ్లామర్ గా చూపించారు.నిధి అగర్వాల్ ప్రస్తుతం ఎంతో సెలెక్టివ్ గా సినిమాలని ఎంచుకుంటోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో నటించింది.అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా మొదలయి చాలా కాలం అవుతుంది.అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో తెలియని పరిస్థితి. ఈ చిత్రంలో నిధి పంచమి పాత్రలో నటిస్తోందని సమాచారం.. అప్పుడెప్పుడో నిధి అగర్వాల్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిధి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు.ఏది ఏమైనా నిధి అగర్వాల్  ఈ చిత్రంపై బాగా ఆశలు పెట్టుకుంది.హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.అయితే తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగానే నిధి అగర్వాల్ పరువాలు యువతకు మత్తెక్కిస్తాయి.. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే ఇంకేమైనా వుందా..నిధి అగర్వాల్ తాజాగా సైమా అవార్డుల వేడుకలో మెరిసింది. అదిరిపోయే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోస్ లో నిధి అగర్వాల్ తన కవ్వించే హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments