NTV Telugu Site icon

Nidhi Agarwal : తన సినీ కెరీర్ గురించి దిగులుపడుతున్న నిధి అగర్వాల్..?

Whatsapp Image 2023 06 28 At 12.31.57 Pm

Whatsapp Image 2023 06 28 At 12.31.57 Pm

నిధి అగర్వాల్.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నాగచైతన్య తో నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమాకి ముందు బాలీవుడ్ లో సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు. టాలీవుడ్ లో ఆమె తరువాత చేసిన సినిమా మిస్టర్ మజ్ను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కానీ నటన పరంగా నిధి ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకు మొదటి కమర్షియల్ హిట్ ను అందించింది. ఈ సినిమాతో తనలోని హాట్ యాంగిల్ నీ కూడా రుచి చూపించింది.ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు మరియు తమిళ భాషల్లో వరుస గా అవకాశాలు వచ్చాయి

తమిళ్ లో ఈశ్వరన్, భూమి మరియు కలగ తలైవన్ చిత్రాలను చేసింది. కానీ ఆ సినిమాలు అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తమిళ్ దర్శకనిర్మాతలు నిధి అగర్వాల్ కు ఆఫర్స్ ఇవ్వడం మానేశారు.ఆ సమయంలో నిధి టాలీవుడ్ లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా `హరి హర వీర మల్లు` వంటి భారీ సినిమాలో హీరోయిన్ గా భారీ ఛాన్స్ వచ్చింది . మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈసినిమాను ఎప్పుడో 2020 సంవత్సరం లోనే అనౌన్స్ చేశారు. కానీ, ఇంత వరకు షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ బాగా బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు.హరి హర వీర మల్లు సినిమా తన కెరీర్ టర్న్ చేస్తుంది అని భావించింది నిధి అగర్వాల్. కానీ మళ్ళీ ఆమెకు నిరాశే ఎదురైంది.. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న హర్రర్ కామెడీ మూవీలో హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కూడా కొంత పూర్తైనట్లు తెలుస్తుంది.ఈ మూవీ కూడా ఇప్పట్లో విడుదల అయ్యే ఛాన్స్ లేదు. ఆదిపురుష్ సినిమా నిరాశపరచడంతో ప్రభాస్ ఫోకస్ మొత్తం సలార్‌, ప్రాజెక్ట్-కె మీదనే పెట్టినట్లు సమాచారం.. ఇవి విడుదల అయిన తర్వాతే మారుతి సినిమా విడుదల ఉంటుందనీ సమాచారం. ఈ రెండు సినిమాలపై ఆశలు పెట్టుకున్న నిధి కెరీర్ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది.నిధి అగర్వాల్ తన కెరీర్ గురించి కాస్త దిగులు పడుతున్నట్లు సమాచారం.

Show comments