NTV Telugu Site icon

Nicholas Pooran Century: 40 బంతుల్లో సెంచరీ.. తొలి ఆటగాడిగా నికోలస్‌ పూరన్‌ అరుదైన రికార్డు!

Nicholas Pooran Fastest Century

Nicholas Pooran Fastest Century

Nicholas Pooran Hits Fastest Hundred in Major League Cricket: విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ)లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎమ్‌ఎల్‌సీ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున ఆడిన పూరన్.. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకుని ఈ రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్‌.. 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. పూరన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేయడంతో ముంబై న్యూయార్క్ ట్రోఫీ గెలుచుకుంది.

ఫైనల్ మ్యాచ్ ముందువరకు మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ)లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. సీటెల్ ఓర్కాస్‌కు ఆడుతున్న క్లాసెన్.. 41 బంతుల్లో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. నికోలస్ పూరన్ 40 బంతుల్లోనే సెంచరీ చేసి క్లాసెన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేశాడు. 2015లో వెస్టిండీస్‌పై ఏబీ కేవలం 31 బంతుల్లోనే శతకం బాదాడు. టీ20లో డేవిడ్ మిల్లర్ ఫాస్టెస్ట్‌ (35 బంతుల్లో) సెంచరీ బాదగా.. టెస్టులో బ్రెండన్ మెక్‌కలమ్ (54 బంతుల్లో) బాదాడు.

Also Read: Mumbai Indians: నికోలస్ పూరన్ విధ్వసం.. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్!

ఇక మేజర్ లీగ్‌ క్రికెట్‌ (ఎమ్‌ఎల్‌సీ) తొలి ఎడిషన్‌ ఛాంపియన్స్‌గా ముంబై న్యూయర్క్‌ జట్టు నిలిచింది. డల్లాస్‌ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో సీటెల్ ఓర్కాస్‌ను 7 వికెట్ల తేడాతో ముంబై చిత్తు చేసింది. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై న్యూయర్క్‌ కెప్టెన్ నికోలస్ పూరన్‌ (137; 55 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్స్‌లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా పూరన్‌ నిలిచాడు. 8 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌.. 388 పరుగులు చేశాడు.

Also Read: Amazon Smart Watch Offers 2023: అమెజాన్‌లో 80 శాతం తగ్గింపు ఆఫర్.. రూ. 1399కే స్మార్ట్ వాచ్! రూ. 5600 ఆదా