Nicaragua’s Sheynnis Palacios wins the 72nd Miss Universe: ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటం నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ అలోండ్రా పలాసియోస్ కార్నెజో మిస్ యూనివర్స్ 2023 టైటిల్ కైవసం చేసుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్‌కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 19న ఎల్ సాల్వడార్‌లో గాలాలో 72వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
23 ఏళ్ల షెన్నిస్ పలాసియోస్ తన పేరును విజేతగా ప్రకటించగానే భావోద్వేగం చెందారు. నయా మిస్ యూనివర్స్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. సాల్వడార్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన భామలు పోటీ పడ్డారు.
Also Read: Telangana Elections 2023: బాబు మోహన్‌కి షాక్ ఇచ్చిన తనయుడు!
భారత్ తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు. ఈ పోటీలో శ్వేతా టాప్ 20 ఫైనలిస్ట్‌లలోకి వచ్చారు. పాకిస్థాన్ క్రీడాకారిణి ఎరికా రాబిన్ కూడా ఈ గ్లోబల్ పోటీలో అరంగేట్రం చేశారు. ఈసారి మిస్ యూనివర్స్ పోటీలలో ఇద్దరు వివాహిత తల్లులు పాల్గొన్నారు. గ్వాటెమాలా నుంచి మిచెల్ కోన్, కొలంబియా నుండి మరియా కామిలా అవెల్లా మోంటానెజ్ పోటీలో పాల్గొన్నారు.
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! 👑 🇳🇮@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023