Site icon NTV Telugu

NIACL Recruitment: ఇన్సురెన్స్ కంపెనీలో ఉద్యోగాలు..450 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Job Vacancy

Job Vacancy

ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం చెయ్యాలని భావించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 450 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ లో పేర్కొన్న విధంగా ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.ఆన్ లైన్ దరఖాస్తులు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ newindia.co.in సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 01 నుంచి ప్రారభం కానుంది. ఇక చివరి తేదీ 19 వరకు ఉందని తెలుస్తుంది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం..

రిస్క్ ఇంజనీర్ – 36

ఆటోమొబైల్ ఇంజనీర్ – 96

లీగల్ – 70

అకౌంట్స్ – 30

హెల్త్ – 75

ఐటీ – 23

జనరల్ – 120

అర్హతలు..

అభ్యర్థులు యొక్క విద్యార్హత పోస్టును బట్టి మారుతుంది. బీటెక్, డిగ్రీ చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు పీజీ కూడా అర్హతగా పేర్కొన్నారు. ఇక వయస్సు 21 నుంచి 30 ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

1.అధికారిక వెబ్‌సైట్ www.newindia.co.inని సందర్శించండి
2: తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి
3: ఇప్పుడు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లైపై క్లిక్ చేయండి
4 తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది.
5: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
6: దీని తర్వాత అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
7. అంతే.. చివరగా అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
ఇకపోతే ఫేజ్ I ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 9న జరుగుతుంది. ఫేజ్ II యొక్క ఆన్‌లైన్ పరీక్ష 8 అక్టోబర్ 2023న నిర్వహించబడుతుంది.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..

Exit mobile version