Site icon NTV Telugu

NIA: మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు..

Nia

Nia

మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లోని మా ఇల్లు ఆశ్రమంలో NIA అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న గాదే ఇన్నయ్య ఆశ్రమాన్ని మరోసారి తనిఖీ చేశారు nia అధికారులు. గాదే ఇన్నయ్య స్వగ్రామమైన సాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఆయన మా ఇల్లు ఆశ్రమం తో పాటు స్వగ్రామంలో నీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమంలోకి… ఇన్నయ్య ఇంటి పరిసర ప్రాంతాలలోకి ఎవరిని అనుమతించని అధికారులు.. లక్ష రూపాయల నగదును కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version