Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!

  • నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి
  • 28 లక్షల కట్నం, 19 తులాల బంగారు ఆభరణాలు
  • పెళ్లై రెండు నెలలు తిరగకముందే మృతి
Dowry Harassment

Dowry Harassment

పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విశాఖలో కలకలం రేపింది. ఈ ఏడాది మార్చి 6వ తేదీన పెళ్లి సమయంలో 28 లక్షల రూపాయల కట్నం, 19 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కానీ పెళ్లయిన మరుసటి రోజు నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు మృతురాలి బంధువులు. మానసికంగా శారీరకంగా పెట్టిన వేధింపులు తట్టుకోలేక నవవధువు తేజశ్రీ తనువు చాలించింది.

క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందని భర్త సోమేశ్వరరావు ఆరోపిస్తున్నాడు. వరకట్న వేధింపులు వల్లే తమ బిడ్డ చనిపోయిందని మృతురాలు తేజశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. భర్తను అదుపులోకి తీసుకునీ రిమాండ్‌కు పంపించారు.